ఏప్రిల్ 11న సెలవు దినం ప్రకటించాలి

803பார்த்தது
ఏప్రిల్ 11న సెలవు దినం ప్రకటించాలి
ఈనెల 11 న సామాజిక విప్లవకారులు , సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబాపూలే జయంతిని పురస్కరించుకుని ఆరోజు ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని. బీసీ పొలిటికల్ యువజన జేఏసీ నల్గొండ జిల్లా అధ్యక్షులు చింతపల్లి సతీష్ గౌడ్ డిమాండ్ చేశారు. అక్టోబర్ 2 న మహా త్మాగాంధీ జయంతి , ఏప్రిల్ 14 న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ జయంతి , అలాగే ఏప్రిల్ 5 న భారత ఉపప్రధాని బాబు జగ్గీవన్ ఆవు జయంతులకు సందర్భంగా జాతీయ సెలవుదినంగా ప్రకటించి గౌరవిస్తున్న ప్రభుత్వాలు అంబేడ్కరే గురువైన మహాత్మా జ్యోతిబా పూలే జయంతి అయిన ఏప్రిల్ 11 న ఎందుకు సెలవు దినంగా ప్రకటించడం లేదని ప్రశ్నించారు.

దేశరాజధాని ఢిల్లీలో ఇంత వరకు కేంద్ర ప్రభుత్వం ఇంత వరకు మహాత్మాజ్యోతిభాపూలే విగ్రహం పెట్టలేదని , రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కూడా గత 9 సంవత్సరాలుగా పూలే విగ్రహం పెట్టలేదన్నారు. అలాగే జాతీయ ప్రాజెక్టులు , స్మారక కేంద్రాలకు రాష్ట్ర ప్రాజెక్టులకు పూలే పేరు పెట్టకుండా దేశంలోని అరవై కోట్ల మంది బిసిలను అవమానిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మహానీయులను గౌరవించే విషయంలోనూ కేంద్ర: రాష్ట్ర ప్రభుత్వాలు వివక్ష చూపుతున్నాయని ఇది చాలా అన్యాయమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించిన ఏప్రిల్ 11 న సెలవు దినంగా ప్రకటించి పూలేను గౌరవించాలని డిమాండ్ చేశారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி