కేంద్రంలో అధికారం చేపట్టిన భాజపా ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జాన్వెస్లీ అన్నారు. గురువారం నాగర్ కర్నూల్ జిల్లా సీపీఎం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఈనెల 24, 25 తేదీల్లో అచ్చంపేటలో నిర్వహిస్తున్న జిల్లా మహా సభలకు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.