నాగర్ కర్నూల్: విద్యార్థులకు వైద్య శిబిరం
మహాత్మ జ్యోతిబాపూలే బీసీ వెల్ఫేర్ వెల్టూర్ స్కూల్ విద్యార్థులకు ఉప్పునుంతల వైద్యాధికారి డాక్టర్ స్వప్న వైద్య శిబిరాన్ని నిర్వహించి టాబ్లెట్లు అందజేశారు. అదేవిధంగా అయోడిన్ సాల్ట్ టెస్ట్ నిర్వహించి విద్యార్థులకు తగిన సలహాలు సూచనలు అందించారు. పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వారు విద్యార్థులకు సూచించారు.