ప్రధాని మోదీ కచ్చితంగా రాజ్యాంగాన్ని చదవలేదని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సంవిధాన్ రక్షక్ అభియాన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మోదీ రాజ్యాంగాన్ని చదవలేదని తాను హామీ ఇవ్వగలనని అన్నారు. ఒకవేళ ఆయన ఈ పుస్తకాన్ని చదివి ఉంటే, ప్రతి రోజు ఇలాంటి పనులు చేసేవాడు కాదని రాహుల్ అన్నారు. రాజ్యాంగాన్ని రక్షించేది గాంధీ ఫ్యామిలీ మాత్రమే అని ఆయన పేర్కొన్నారు.