రేపటి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి
కలెక్టర్ కార్యాలయంతో పాటు తహసిల్దార్ కార్యాలయాల్లో ఈనెల 30వ తేదీన నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10: 30 నుంచి మధ్యాహ్నం 1: 30 గంటల వరకు ప్రజల నుంచి నేరుగా వినతి పత్రాలు స్వీకరిస్తారని చెప్పారు. అధికారులు సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు