జిల్లా ఎస్పి ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశానుసారం జిల్లా సైబర్ సెక్యూరిటీ డిఎస్పీ సుభాష్ చంద్ర బోస్ ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో సైబర్ నేరాలు నార్కోటిక్స్, షీ టీం వారి అవగాహన సదస్సును బుధవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు ఎస్పి అడ్మిన్ మహేందర్ ముఖ్య అతిదిగా హాజరై విశ్రాంత ఉద్యోగులకు, సీనియర్ సిటిజన్ లకు అవగాహన కల్పించారు.