మెదక్ జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాలలో ధాన్యమును వెంటనే సేకరించి తూకం వేయాలని, అదనపు కలెక్టర్ ను మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి బుధవారం కోరారు. ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. తేమ యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు, అన్నిరకాల మౌలిక వసతులు కొనుగోలు కేంద్రాలలో కల్పించాలన్నారు. సన్న, దొడ్డు రకం ధాన్యం కొనుగోలుకు వేర్వేరుగా చేపట్టాలన్నారు.