సింగరేణి గుర్తింపు కార్మిక సంఘంగా ఏఐటీయూసీ గుర్తింపు పత్రం అందుకుంది. సోమవారం కొత్తగూడెంలోని సింగరేణి భవన్ లో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్, తదితరులు యాజమాన్యం నుండి గుర్తింపు సంఘం పత్రం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ సీ అండ్ ఎండీ బలరామ్ పాల్గొన్నారు.