హాజీపూర్ మండలంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టును మంగళవారం సాయంత్రం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సందర్శించారు. ప్రాజెక్టులో నీటి ప్రవాహాన్ని ఆయన పరిశీలించారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రాజెక్టు గేట్లు ఎత్తే సమయంలో లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎప్పటికప్పుడు ముందస్తు సమాచారం ఇవ్వాలని అధికారులకు సూచించారు.