మంచిర్యాల జిల్లాలో ఆది, సోమవారం జరిగే గ్రూప్- 3 రాత పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు డీసీపీ భాస్కర్ శనివారం తెలిపారు. మంచిర్యాల, బెల్లంపల్లి సబ్ డివిజన్ల పరిధిలో 48 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 8 వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని, పరీక్ష కేంద్రాల సమీపంలోని అన్ని జిరాక్స్, ఇంటర్ నెట్ సెంటర్స్ ముసివేయాలన్నారు.