కాసిపేట: కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
మందమర్రి ఏరియా కాసిపేట 2 గని కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ నాయకులు గని మేనేజర్ లక్ష్మీనారాయణకు వినతిపత్రం సమర్పించారు. ఆదివారం గని ఆవరణలో గేట్ మీటింగ్ లో బెల్లంపల్లి బ్రాంచి ఇన్ చార్జి చిప్ప నరసయ్య, బ్రాంచి కార్యదర్శి దాగం మల్లేష్ మాట్లాడుతూ కోల్ కటింగ్, బిట్లు, రాడ్స్, డ్రిల్స్ బూట్లు నాణ్యమైనవి రావడంలేదనన్నారు. షిఫ్టులో టెక్నీషియన్లకు హెల్పర్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు.