కోటపల్లి మండలం పిన్నారంలోని అంగన్వాడీ కేంద్రంలో లబ్ధిదారులకు కుళ్లిపోయిన కోడిగుడ్లు పంపిణీ చేశారు. కేంద్రంలో కొన్ని రోజులుగా నిల్వ ఉన్న కోడిగుడ్లు అందించడంతో అనారోగ్యం పాలవుతున్నట్లు లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. కొంతకాలంగా నాసిరకం కోడిగుడ్లు పంపిణీ చేయడంపై సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని వారు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.