భీమారం మండల కేంద్రంలో కోతుల బీభత్సం రోజురోజుకు తీవ్రమవుతుందని ఇప్పటికే పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ గ్రామస్తులు బస్టాండ్ నుంచి ఎంపీడీవో కార్యాలయం వరకు మంగళవారం ర్యాలీ చేపట్టారు. గ్రామంలో కోతుల గుంపులు పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులు, వృద్ధులు, మహిళలపై దాడులు చేస్తున్నాయని ఆరోపించారు. అధికారులు చొరవ తీసుకొని కోతుల బెడద తీర్చాలని వాపోయారు.