వేమనపల్లి మండలంలోని బుయ్యారం గ్రామంలో శనివారం సీఐ సుధాకర్, నీల్వాయి ఎస్సై శ్యాం పటేల్ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామాల్లో తనిఖీలు చేసి సరైన పత్రాలు లేని 33 బైకులకు జరిమానా విధించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ప్రజల భద్రత కోసమే కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ఏమైనా సమస్యలు ఉంటే పోలీసుల దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.