బెల్లంపల్లి కార్యాలయంలో సోమవారం ఏజెంట్లు నిరసన తెలిపారు. యాజమాన్యం ఏజెంట్ల హక్కులను కాలరాసే విధంగా తీసుకున్న నిర్ణయాలను నిరసిస్తూ ఏజెంట్లు కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ హరీ కృష్ణకు వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. లే ఆఫ్ ఆల్ ఇండియా యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు మధ్యాహ్నం 1 గంట నుండి 2 రెండు గంటల వరకు నిరసన కొనసాగించారు.