ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలని డిసెంబర్ 1న హైదరాబాద్ లో చేపట్టిన మాలల సింహగర్జన పోస్టర్లను కాసిపేట మాల మహానాడు జేఏసీ కన్వీనర్ తొగరు సుధాకర్ మంగళవారం విడుదల చేశారు. ఎస్సీ వర్గీకరణను వెంటనే రద్దు చేయాలని ఆందోళన చేస్తున్నామన్నారు. పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ లక్ష్మణ్, నాయకులు సమ్మయ్య, లక్ష్మణ్ దాసు, మధుకర్, సుధీర్, రాజేష్, కనకరాజు, మల్లేష్ పాల్గొన్నారు.