కాసిపేట మండలంలోని దేవాపూర్ గ్రామపంచాయతీ ఆవరణలో శనివారం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేద యువతుల పాలిట వరం కళ్యాణలక్ష్మి పథకం అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కాసిపేట మండల నాయకులు పాల్గొన్నారు.