ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వేకు ప్రజలు సహకరించాలని మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత తెలిపారు. బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పదో వార్డులో చేస్తున్న సర్వేను శనివారం ఆమె పరిశీలించారు.. ప్రజలు తమకు సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా వివరించి అధికారులకు సహకరించాలని కోరారు.. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, అధికారులు, సర్వే సిబ్బంది పాల్గొన్నారు.