మంచిర్యాల జిల్లాలో ప్రభుత్వ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ స్పష్టం చేశారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. ప్రభుత్వ భూములు ఆక్రమించిన క్రమంలో తక్షణమే నిర్మాణాలు అడ్డుకుంటున్నామని గుర్తు చేశారు. ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికాకుండా అధికారుల సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.