హైదరాబాద్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. బోరబండలోని శివాజీనగర్‌లో ఓ యువకుడిని దుండగులు కిరాతకంగా హత్య చేశారు. సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు. పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.