బీసీల చైతన్యం కోసం జిల్లా పాదయాత్ర నిర్వహిస్తామని బీసీ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ రాచాల యుగేందర్ గౌడ్ అన్నారు. ఈ మేరకు ఆదివారం వనపర్తి పట్టణంలో వివిధ బీసీల నాయకులతో నాగయ్య రెసిడెన్సిలో సమావేశం నిర్వహించారు. బీసీలపై ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉందని, బీసీలను రాజకీయంగా ఆర్థికంగా అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్, కోళ్ల వెంకటేష్, సత్యం సాగర్, బలరాం తదితరులు పాల్గొన్నారు.