వ్యవసాయ కార్మికులకు అసలు భద్రత భూమే: బీకేఎంఎస్

558பார்த்தது
వ్యవసాయ కార్మికులకు అసలు భద్రత కల్పించేది వ్యవసాయ భూమని, ప్రభుత్వ భూములను కూలీలకు పంచాలని బికేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కలకొండ కాంతయ్య అన్నారు. ఆదివారం బీకేఎంఎస్ వనపర్తి జిల్లా నిర్మాణ సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూమి ఉందన్నారు. పింఛన్లు, రేషన్ కార్డులు, తదితర సంక్షేమ పథకాలు తత్కాలిక ఉపశమనం మాత్రమే అన్నారు. ఉపాధి కూలీల పెండింగ్ వేతనం వెంటనే ఇవ్వాలన్నారు. నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி