అధికారులు ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం నారాయణపేట కలెక్టరేట్ లోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల లోపే ఓటరు తుది జాబితాను సిద్ధం చేయాలని అన్నారు. 01 నవంబర్ 2025 నాటికి 18 ఏళ్లు పూర్తయిన వారికి ఓటు హక్కు కల్పించాలని అన్నారు. హోటల్ జాబితా సిద్ధం చేసేందుకు పార్టీల నాయకులు సహకరించాలని కోరారు.