మరికల్ మండల కేంద్రంలోని చెరువు కట్టపై వున్న మైసమ్మ అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో మంగళవారం బంద్ నిర్వహించారు. వ్యాపార సంస్థలను బంద్ చేయించారు. అనంతరం అంతర్రాష్ట్ర రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అంతకుముందు ప్రధాన రహదారి గుండా ర్యాలీ నిర్వహించారు. నిరసనలో అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు.