దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో రైతులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న బీజేపీ నాయకులను బుధవారం మరికల్ పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ప్రజాస్వామ్యయుతంగా బాధిత రైతులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న తమను అరెస్టు చేయడం సరైంది కాదని నాయకులు రాజేష్ అన్నారు. ఫార్మాసిటీ ఏర్పాటుకు రైతుల నుండి బలవంతంగా భూములు లాక్కోవడం సరైంది కాదని అన్నారు. బీజేపీ నాయకులు అరెస్టులను ఖండించారు.