మరికల్ మండలం తిలేరు గ్రామ స్టేజి అంతర్రాష్ట్ర రహదారిపై సోమవారం మాజీ ఎమ్మెల్యే వీరారెడ్డి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాన్ని డిసిసి అధ్యక్షుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి, తన తల్లి మాజీ సర్పంచ్ రేవతమ్మ తో కలిసి ప్రారంభించారు. వేసవిలో రహదారిపై వెళ్లే ప్రజల దాహార్తి తీర్చేందుకు గత 35 ఏళ్లుగా అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.