రైతులకు ఇచ్చిన హామీలను ప్రజా ప్రభుత్వం నెరవేరుస్తుందని ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. సోమవారం అచ్చంపేట, అమ్రాబాద్ మండలాల్లో ఆయన సుడిగాలి పర్యటన నిర్వహించారు. అచ్చంపేట పిఎసిఎస్ వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. నేటి నుండి ప్రభుత్వం సన్న వరికి 500 రూ. బోనస్ ఇస్తుందన్నారు. దీంతో 2. 445 కోట్ల రూ. బోనస్ గా రైతులకు అందనున్నట్లు తెలిపారు.