నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ లో ఈనెల 17 , 18 తేదీలలో జరగబోయే గ్రూప్ 3 పరీక్షకు సంబంధించి అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ నిర్వహించారు. నాగర్ కర్నూల్ జిల్లాలో గ్రూప్ 3 పరీక్ష కొరకు 33 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు, 9478 మంది అభ్యర్థులు పరీక్ష రాయబోతున్నట్లు తెలిపారు. 24 మంది అభ్యర్థులకు ఒక ఇన్విజిలేటర్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు.