మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి శనివారం డాక్టరేట్ అందుకున్నారు. పాండిచ్చేరి లోని కంబన్ కళారై అరాగం వేదికగా గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్శిటీ వర్చువల్ ఇన్సిట్యూట్ వారు నిర్వహించిన కార్యక్రమంలో ప్రజా సేవ, సామాజిక సేవలకు గాను డాక్టరేట్ పట్ట అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చివరి శ్వాస వరకు ప్రజా సేవ చేస్తానని అన్నారు. సేవలను గుర్తించి డాక్టరేట్ అందించిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.