గ్రూప్-1 పరీక్షలో ఓ మహిళా అభ్యర్థి కాపీ కొడుతూ దొరికిపోయింది. మహబూబ్‌నగర్ జిల్లా ఖానాపూర్‌కు చెందిన
మహిళ సెకండ్ గ్రేడ్ టీచర్‌గా పనిచేస్తున్నారని తెలిసింది. ఇవాళ రంగారెడ్డి జిల్లాలోని సీవీఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పరీక్షకు హాజరయ్యారు. ఈక్రమంలోనే చీరకొంగులో చీటీలు పెట్టుకొచ్చి, కాపీయింగ్ కొడుతుండగా ఇన్విజిలేటర్ గుర్తించారు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.