పాలమూరు ఉమ్మడి జిల్లా అవినీతిలో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉంది. గతంలో ఎప్పుడు లేని విధంగా అవినీతి కేసులు నమోదవుతున్నాయి. రెవెన్యూ, విద్యుత్, పోలీసు పలు శాఖలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో రెడ్ హ్యాండెడ్ గా 14 మందిని పట్టుకున్నారు. లంచం తీసుకుంటూ పట్టుబడిన వారిని ఏసీబీ అధికారులు జైలుకు పంపిస్తున్నా.. ప్రభుత్వ అధికారులలో తీరు మారడం లేదని జిల్లా వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.