జడ్చర్ల పట్టణంలో పెరుగుతున్న జనాభా అవసరాలు, లావాదేవీలను దృష్టిలో ఉంచుకొని అదనపు పోలీస్ సిబ్బందిని మంజూరు చేయాలని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే సోమవారం రాష్ట్ర డీజీపీ డా. జితేందర్ ను కలిసి కోరారు. జనాభా 1. 25 లక్షల దాకా ఉండగా ప్రతి రోజూ 30 వేల మంది పట్టణానికి రాక పోకలు సాగిస్తున్నారని అనిరుధ్ రెడ్డి తెలిపారు. జడ్చర్లలో 44వ, 167వ జాతీయ రహదారుల కూడలిగా ఉందన్నారు.