జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలంలో శుక్రవారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి జాతీయ రహదారి సమీపంలో ఉన్న వెంకటసాయి నగర్ జలమయం అయింది. శనివారం ఉదయం కాలనీలో నీళ్లు నిలవడంతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. కాలనీ మొత్తం చెరువును తలపిస్తుంది. ఎక్కడ చూసినా వర్షపునీరు నిలిచింది. నీటిని బయటకు మళ్లించాలని కాలనీవాసులు కోరుతున్నారు.