దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండలం వర్నే హై లెవెల్ బ్రిడ్జ్ ను బుధవారం దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ప్రత్యామ్నాయ భూమిని కేటాయించకపోవడంతో రైతులకు ప్రత్యామ్నాయంగా భూమిని కేటాయించి, కురుమూర్తి బ్రహ్మోత్సవాలలోపు భక్తులకు బ్రిడ్జ్ ను అందుబాటులో తీసుకురావాలన్న లక్ష్యంతో పనులను పూర్తి చేయించి, బ్రిడ్జ్ ను ప్రజలకు అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు.