దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలం శ్రీకురుమూర్తి దేవస్థానంకు శాశ్వత మంచి నీటి పరిష్కారం కోసం మిషన్ భగీరథ 200 కె. ఎల్ సంపు నిర్మాణానికి శనివారం దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ గౌని గోవర్ధన్ రెడ్డి, ఈఓ మధునేశ్వర్ రెడ్డి, పాలక మండలి సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.