మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలంలో కులగణన సర్వే పక్రియ ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ మేరకు శనివారం కులగణన సర్వేకు సంబంధించిన బుక్ లెట్స్ లను అధికారులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి, నోడల్ ఆఫీసర్ మంజులత పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్యుమరేటర్లు, సీఆర్పీ, మండల కోఆర్డినేటర్ తదితరులు పాల్గొన్నారు.