మహబూబ్ నగర్ జిల్లాలోని శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానానికి ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న సందర్భంగా దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి డీఐజీతో కలిసి శనివారం జాతరలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. వారు సంబంధిత అధికారులతో చర్చించి, సీఎం రూట్ మ్యాప్, హెలిప్యాడ్, భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. ఎలివేటెడ్ కారిడార్ తో కూడిన ఘాట్ రోడ్ నిర్మాణానికి, పలు అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేయనున్నారు.