ఎస్సీ వర్గీకరణను వ్యతిరేఖిస్తూ ఈ నెల 25న జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ ఆధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న పాదయాత్రను విజయవంతం చేయాలని మాల మహానాడు టేకులపల్లి మండల అధ్యక్షులు కర్లపూడి సుందర్ పాల్ గురువారం తెలిపారు. పాదయాత్ర ఈ నెల 25న భద్రాచలంలో ప్రారంభమై 27న టేకులపల్లి మండలం సులానగర్లో ప్రవేశిస్తుందన్నారు.