టేకులపల్లి మండలంలోని బద్దుతండా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో పిల్లలకు, ఉపాధ్యాయ సిబ్బందికి వైద్యాధికారి డాక్టర్ కందుల దినేష్ అయోడిన్ లోపం వల్ల కలిగే రుగ్మతలపై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్యం కావాలంటే, మానవ శరీరానికి సూక్ష్మ పోషకం అయిన అయోడిన్ ఎంతో ముఖ్యమన్నారు. అయోడిన్ లోపం వల్ల కలిగే అనారోగ్య సమస్యల గురించి వివరించారు.