రాష్ట్ర ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. సోమవారం ఎమ్మెల్యే ఇల్లందు నియోజకవర్గంలోని బయ్యారం పెద్ద చెరువు మత్స్య సహకార సంఘం సభ్యులకు మంజూరైన చేప పిల్లలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. 100% రాయితీతో రాష్ట్ర ప్రభుత్వం చేప పిల్లలను అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు.