పినపాక మండలంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం విస్తృతంగా పర్యటిస్తున్నారు. గట్టంపల్లి, పోట్లపల్లి, మల్లారం పంచాయతీల్లో పలు అభివృద్ధి పథకాలను ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అన్నారు. ప్రారంభించిన పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.