ఈ నెల 11న పాల్వంచలో జరిగే ఆదివాసీల మహాసభను విజయవంతం చేయాలని గిరిజన సంఘం జిల్లా నాయకులు శ్రీను అన్నారు. బుధవారం మణుగూరు మండల కేంద్రంలోని గిరిజన భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే ఎస్టీ వర్గీకరణపై కమిషన్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.