సింగరేణి సులబ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఇఫ్ట్ ఆధ్వర్యంలో మంగళవారం మణుగూరు ఏరియా ఎస్ఓటు శ్యాంసుందర్ కు వినతిపత్రం అందజేశారు. సులబ్ కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వెంటనే సులబ్ కార్మికులకు ఇఎస్ఐ వైద్య సౌకర్యం కల్పించాలని నాయకులు మంగీలాల్ అన్నారు. ఈపీఎఫ్ సౌకర్యం అలాగే సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు చెల్లించినట్లు ఐదువేల రూపాయలు బోనస్ ఇవ్వాలని పేర్కొన్నారు.