అశ్వాపురం మండలం మల్లెల మడుగు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించగా ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే రేఖ కాంతారావు సోమవారం మరణించిన సోయం సందీప్ మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలిపారు.