మణుగూరు: ఉచిత బస్సు పథకంపై సమీక్ష జరపాలి

72பார்த்தது
మణుగూరు: ఉచిత బస్సు పథకంపై సమీక్ష జరపాలి
తెలంగాణలో ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆటో సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నవంబర్ 5న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు ఆర్ మధుసూదన్ రెడ్డి ఆటో కార్మికులను కోరారు. శనివారం మణుగూరు పట్టణంలోని వివిధ ఆటో అడ్డాల వద్ద జరిగిన సమావేశాలలో ఆయన పాల్గొని మాట్లాడారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై సమీక్ష నిర్వహించాలని కోరారు.

தொடர்புடைய செய்தி