గంజాయి, మత్తు పదార్థాలను రవాణా చేసే వారిపై ఉక్కుపాదం మోపాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ అన్నారు. బూర్గంపాడు పోలీస్ స్టేషన్ ను ఎస్పీ ఆకస్మికంగా తనీఖీ చేశారు. స్టేషన్ రికార్డులను ఆయన పరిశీలించారు. నేరాల నియంత్రణకు నిత్యం పెట్రోలింగ్ నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. మత్తు పదార్థాల రవాణాపై అప్రమత్తంగా ఉండి వాటిని నియంత్రించాలన్నారు.