జూలూరుపాడు మండల పరిధిలో బేతాళపాడు గ్రామం పంచాయతీ చీపురుగూడెం గ్రామంలో చెక్ డ్యామ్ నిర్మాణం ఎంతో వ్యయంతో నిర్మించారు. నిర్మాణ లోపంతో చెక్ డ్యామ్ కరకట్ట అధ్వానంగా తయారయిందని భారతీయ గోర్ బంజారా పోరాట సంఘం జిల్లా అధ్యక్షులు దుర్గాప్రసాద్ శనివారం అన్నారు. సంబంధిత కాంట్రాక్టర్ తక్షణమే నాసిరకంగా నిర్మించిన కరకట్టకు మరల మరమ్మతులు చేసి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.