జూలూరుపాడు మండలం మాచినేనిపేట తండా గ్రామపంచాయతీలో శనివారం కులగణన సర్వే కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు. ఎన్యుమరేటర్ ఎస్. లలిత ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని చేపట్టారు. సర్వేలో భాగంగా కుల, ఆర్థిక, సామాజిక అంశాలపై వివరాలను అడిగి నమోదు చేసుకున్నారు. కులగణన సర్వేలో ప్రజలు సహకరించాలని కోరారు.