భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని స్థానిక కోర్టు నూతన న్యాయమూర్తి శివ నాయక్ మంగళవారం దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో నూతన న్యాయమూర్తిని ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం న్యాయమూర్తి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. తదనంతరం న్యాయమూర్తిని అర్చకులు స్వామి వారి శేష వస్త్రాలతో ఘనంగా సత్కరించారు.