భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందిన పేదల మృతదేహాల తరలింపు కోసం ఉచిత పార్థివ వాహన సేవలు అందుబాటులో ఉన్నాయని ప్రోగ్రాం మేనేజర్ భూమా నాగేంద్ర, కోఆర్డినేటర్ ప్రణయ్ గురువారం తెలిపారు. పేదలు ఈ సేవలను ఉపయోగించుకుని ఖర్చు లేకుండా మృతదేహాలను ఇంటికి ఉచితంగా తీసుకెళ్లవచ్చని అన్నారు. ఈ సేవలు 24 గంటలూ అందుబాటులో ఉండేలా 108 లేదా ఆసుపత్రి సూపరింటెండెంట్ ద్వారా పార్థివ వాహనం కోసం సంప్రదించాలని వారు సూచించారు.